బాబు హైదరాబాద్‌లో చేస్తున్న గలీజు పనులివే!: విజయసాయిరెడ్డి

  • బాబు గ్యాంగు కుట్రలకు తెగబడింది
  • గోతులు తవ్వడం, చీకటి వ్యవహారాలు
  • మ్యానిప్యులేషన్లు, వ్యవస్థలను మ్యానేజ్ చేయడం
  • వీటిల్లో మునిగి తేలుతుంటాడు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చి, ఇంకా చేయాల్సిన పనుల గురించి జగన్ గారు తపన పడుతుంటే, బాబు గ్యాంగ్ హైదరాబాద్ లో తిష్ఠ వేసి కుట్రలకు తెగబడ్డారు. రాష్ట్ర శ్రేయస్సు అవసరం లేదు. ప్రజలు సంతోషంగా ఉండొద్దు. సంక్షేమ పాలనను ఎలా అడ్డుకోవాలా అని స్కెచ్చులు వేస్తున్నారు' అంటూ విమర్శించారు.
 
'బాబు హైదరాబాద్ లో చేస్తున్న గలీజు పనులివే. గోతులు తవ్వడం, చీకటి వ్యవహారాలు, మ్యానిప్యులేషన్లు, వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో మునిగి తేలుతుంటాడు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని విజయవంతంగా సమాధి చేసి, దళారి స్థాయికి పతనమయ్యాడు. అధికారం దరిదాపుల్లోకి ఎప్పటికీ రాలేడు' అని విమర్శించారు.

Vijay Sai Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News